ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితి గారాబుగా మారింది. డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారులు ప్రకటించిన ప్రకారం, పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ మరియు స్పాండిలైటిస్ తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారని అధికారికంగా వెల్లడించారు.
అస్వస్థత కారణంగా, రేపు జరగనున్న కేబినెట్ భేటీకి పవన్ కల్యాణ్ హాజరుకావడం కష్టమవుతుందని తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా, ఈ సమావేశానికి గైర్హాజరు అవ్వొచ్చు.
ఇతర విషయాలకు వస్తే, పవన్ కల్యాణ్ తాజా చిత్రం “హరిహర వీరమల్లు” షూటింగ్ ను ఈ రోజు ప్రారంభించినట్లు సమాచారం. అయితే, అనారోగ్య కారణాలతో, ఆయన షూటింగ్ లో పాల్గొనలేకపోవచ్చని చిత్రబృందం తెలిపింది.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఆరోగ్యం త్వరగా పుంజుకుంటూ, తన కార్యక్రమాలకు తిరిగి హాజరయ్యేందుకు ఆశిస్తున్నారు.