బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో అరెస్ట్ అయిన షరీఫుల్ ఇస్లాం అమీన్ ఫకీర్ గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నిందితుడి తండ్రి మహ్మద్ అమీన్ ఫకీర్ ఇటీవల మీడియాతో మాట్లాడినపుడు పలు సందేహాలు వ్యక్తం చేశాడు.
పోలీసులు విడుదల చేసిన వీడియోలో ఉన్న వ్యక్తి తన కుమారుడి కాకపోవాలని స్పష్టం చేసిన మహ్మద్ అమీన్, తన కుమారుడు షరీఫుల్ జుట్టును పొట్టిగా కత్తిరించుకోవడం అలవాటే కానీ, వీడియోలో చూపిన వ్యక్తికి పొడుగు జుట్టు ఉందని పేర్కొన్నాడు. “తన కుమారుడికి ఆ ప్రాసెస్ లో పొడుగు జుట్టు ఎలా వచ్చిందని” మహ్మద్ అమీన్ ప్రశ్నించాడు.
ఇంకా, “సైఫ్ అలీ ఖాన్ వంటి ప్రముఖ హీరోపై దాడి చేయడం సామాన్యులకు సాధ్యమా?” అని ఆయన సందేహం వ్యక్తం చేశాడు. “సైఫ్ ఇంట్లోకి వెళ్లడం సులభంగా జరిగిందా?” అని అడిగారు. ఈ దాడికి సంబంధించి మహ్మద్ అమీన్ ఫకీర్ గంభీరంగా స్పందిస్తూ, ఈ కేసులో తన కుమారుడిని అన్యాయంగా ఇరికించారని ఆరోపించాడు.
తమకు ఈ కేసులో సాయం చేయడానికి భారతదేశంలో ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే, బంగ్లాదేశ్ లో న్యాయపోరాటం చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు.
మహ్మద్ అమీన్ మరిన్ని వివరాలు ఇస్తూ, తన కుమారుడు గతేడాది మార్చిలో భారత్ కు అక్రమంగా వలస వచ్చాడని, ప్రస్తుతం ముంబయిలో ఓ హోటల్ లో పనిచేస్తున్నాడని వెల్లడించాడు. “ప్రతి నెల 10వ తేదీన జీతం తీసుకున్న వెంటనే తాను తనను ఫోన్ చేసేవాడని” ఆయన పేర్కొన్నాడు.
ఈ కేసు మరింత సీరియస్ అవుతున్న నేపథ్యంలో, పోలీసులు ఇప్పటికీ విచారణ కొనసాగిస్తున్నారు.