ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రయాగ్‌రాజ్‌లోని సెక్టార్ 22, ఛట్‌నాగ్ ఘాట్ వద్ద ఈ రోజు అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 15 గుడారాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
గతంలో కూడా మహా కుంభమేళాలో కొన్ని అగ్నిప్రమాదాలు సంభవించాయి, వాటి కారణంగా భారీ నష్టాలు వాటిల్లాయి. ఈ ఘటనలో గాయాలు మాత్రం రాలేదు. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
దాదాపు పదిరోజుల క్రితం కూడా గ్యాస్ సిలిండర్లు పేలి భారీ మంటలు చెలరేగి 18 టెంట్లు కాలిపోయాయి. ఇదిలా ఉండగా, నిన్న జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ సంఘటనలు కుంభమేళా ఏర్పాట్లపై ప్రశ్నలను తెరమీద తెచ్చాయి. భక్తులు, పర్యాటకులు సురక్షితంగా ఉండేలా ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకోవాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.