ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ సభలో బీజేపీ అభ్యర్థి రవీందర్ సింగ్ నేగి, ప్రధాని మోదీ పాదాలకు నమస్కరించిన సన్నివేశం ఒక వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
నిన్న జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీతో పాటు బీజేపీ కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, వేదికపై ఉన్న రవీందర్ సింగ్ నేగి, ప్రధాని మోదీ వద్దకు వెళ్లి ఆయన పాదాలకు నమస్కారం చేశారు. కానీ, ప్రధాని మోదీ వెంటనే నేగిని అడ్డుకుని, అతడి పాదాలకు మూడుసార్లు నమస్కరించి, మర్యాదగా స్పందించారు.
రవీందర్ సింగ్ నేగి, ఢిల్లీలోని పట్‌పర్‌గంజ్ ప్రాంతంలోని వినోద్ నగర్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా పనిచేస్తున్నారు. 2020లో, ఆయన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో పోటీ చేసి కేవలం 2 శాతం ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. కానీ 2022లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిపై 2,000 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. ఇప్పుడు, ఆయన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచారు.
ఈ వీడియో సరికొత్త రాజకీయ చర్చలకు దారితీసింది, మరియు ఆ సంఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో అనేక వ్యాసాలతో వైరల్ అవుతుంది.