ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు ఫ్రాన్స్ మరియు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనను సంబంధించి వివరాలను కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలియజేశారు.
ఫ్రాన్స్ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు ప్యారిస్‌లో ఉంటారు. ప్యారిస్‌లో జరగబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సదస్సులో ఆయన పాల్గొననున్నారు. అలాగే, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యూయెల్ మాక్రాన్‌తో కలిసి ఏఐ యాక్షన్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ సందర్భంగా, ప్రధానమంత్రి మోదీ ఫ్రాన్స్‌లోని న్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్‌ను పరిశీలిస్తారు.
12వ తేదీ సాయంత్రం ఆయన ఫ్రాన్స్ నుండి బయలుదేరి 13వ తేదీ ఉదయం వాషింగ్టన్ చేరుకుంటారు. అక్కడ, ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరగనున్నాయి.
ఈ పర్యటన ద్వార ప్రపంచదేశాలతో భారత సంబంధాలను మరింత బలపరచడమే ప్రధాన లక్ష్యంగా ఉన్నట్లు భావించబడుతోంది.