స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో **ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఆగ్రహానికి గురిచేశాయి. భరత్, ఈ కార్యక్రమంలో “భవిష్యత్తులో ఏపీ ముఖ్యమంత్రి నారా లోకేశ్ గారే” అంటూ ప్రసంగించారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత, “ఎవరు కాదన్నా ఇది జరిగి తీరుతుందనే” కోణంలో మాట్లాడారు.
ఈ వేదికపై ఉన్న చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి, భరత్ పై కఠినంగా మండిపడ్డారు. “వ్యక్తిగత అభిప్రాయాలు ఇలాంటి వేదికలపై మాట్లాడొద్దని” ఆయన హెచ్చరించారు. “ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు? మనం వచ్చిన పనేమిటి… మీరు మాట్లాడుతున్నదేమిటి? అసందర్భ ప్రసంగాలు చేయొద్దని” చంద్రబాబు మంత్రి భరత్‌ను మందలించారు.
ఇక, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తదితర ప్రముఖులు కూడా పాల్గొన్నారు.